PM Modi: ‘అర్బన్‌ నక్సల్స్‌’ కారణంగానే సర్దార్‌ సరోవర్‌ పనులు నిలిచిపోయాయి: మోదీ

రాష్ట్రాల పర్యావరణ శాఖా మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ కొందరు పర్యావరణ ఉద్యమకారులపై మండిపడ్డారు. వారిని అభివృద్ధి నిరోధకులుగా

Published : 24 Sep 2022 02:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాష్ట్రాల పర్యావరణశాఖ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ కొందరు పర్యావరణ ఉద్యమకారులపై మండిపడ్డారు. వారిని అభివృద్ధి నిరోధకులుగా పేర్కొన్నారు. గుజరాత్‌ రాష్ట్రం నర్మద జిల్లాలోని ఏక్తానగర్‌లో ఆయన పర్యావరణ శాఖ మంత్రుల జాతీయ సదస్సును వర్చువల్‌ ప్రారంభించారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ ‘‘ రాజకీయ మద్దతుతో అర్బన్‌ నక్సల్స్‌, అభివృద్ధి నిరోధక శక్తులు సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని అడ్డుకొన్నాయి. ప్రాజెక్టు కారణంగా పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందంటూ ఉద్యమాలు చేశాయి. ఫలితంగా చోటు చేసుకొన్న జాప్యంతో పెద్ద ఎత్తున నిధులు వృథా అయ్యాయి. ఇప్పుడు ఆనకట్ట నిర్మాణం పూర్తయ్యాక వారి ఆరోపణల్లో ఎంత నమ్మదగినవో మీరే అంచనా వేసుకొంటారు’’ అని మోదీ పేర్కొన్నారు. 

‘‘ఈ అర్బన్‌ నక్సల్స్‌ ఇంకా చురుగ్గానే పనిచేస్తున్నారు. వ్యాపారాలను సులభతరం చేసే, జీవితాలను సరళతరం చేసే ప్రాజెక్టులు పర్యావరణం పేరిట నిలిచిపోకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి వారి కుట్రలను తిప్పికొట్టే క్రమంలో మనం సమతౌల్యతను పాటించాలి’’ అని మోదీ వివిధ రాష్ట్రాల పర్యావరణ మంత్రులకు సూచించారు.  కొన్ని రకాల రాజకీయ వర్గాలను, నక్సల్స్‌ సానుభూతిపరులను, సామాజిక ఉద్యమకారులను ఉద్దేశించి వాడుతుంటారు. ప్రధాని మోదీ గతంలో కూడా రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి ఈ పదం చాలా సార్లు వాడారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని