Modi: ప్రమాణ స్వీకార వేదికపై.. ప్రధాని మోదీ సహా 36 మంది

చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా వేదికపై 36 మంది మంది ఆశీనులు కానున్నారు.

Published : 12 Jun 2024 04:57 IST

ఈనాడు-అమరావతి: చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా వేదికపై 36 మంది మంది ఆశీనులు కానున్నారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ దంపతులతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితిన్‌రామ్‌ మాఝి, చిరాగ్‌ పాశ్వాన్, నితిన్‌ గడ్కరీ, కిషన్‌రెడ్డి, కె.రామ్మోహన్‌నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్‌ శిందే, మోహన్‌ యాదవ్, కేంద్ర సహాయ మంత్రులు జయంత్‌ చౌదరి, అనుప్రియా పటేల్, రామ్‌దాస్‌ అథవాలే, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు ప్రపుల్‌ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్, భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జి సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ప్రముఖ సినీనటులు చిరంజీవితోపాటు రజనీకాంత్‌ దంపతులు హాజరవుతున్నారు. వీరితోపాటు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్‌ తదితరులు వేదికపై ఉంటారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు మంగళవారం రాత్రికే విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, తెదేపా ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. 

వివిధ దేశాల రాయబార కార్యాలయ అధికారులూ 

సింగపూర్, దక్షిణ కొరియా, నెదర్లాండ్, జపాన్‌ తదితర దేశాల రాయబార కార్యాలయాల అధికారులు, ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కొరియా కాన్సుల్‌ జనరల్, ఇతర ప్రతినిధులు మంగళవారమే విజయవాడకు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు