PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. అక్టోబర్‌ 1న ప్రధాని రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Published : 27 Sep 2023 13:33 IST

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. అక్టోబర్‌ 1న ప్రధాని రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి మోదీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి 1.35కి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌ బయల్దేరతారు. 2.05కి అక్కడికి చేరుకుని 2.15 నుంచి 2.50 వరకు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు  ‘భాజపా సమరభేరి’ సభాస్థలికి చేరుకుని 4 గంటల వరకు అక్కడే ఉంటారు. సభావేదిక నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని మోదీ పూరించనున్నారు. సభ అనంతరం హెలికాప్టర్‌లో తిరిగి శంషాబాద్‌ చేరుకుని అక్కడిని నుంచి విమానంలో దిల్లీ వెళ్తారు. 

తొలుత ఆయన బేగంపేట చేరుకుని అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్లనున్నట్లు గతంలో భాజపా వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని