Devineni uma: జగన్ నిర్లక్ష్యం వల్లే అనిశ్చితిలోకి పోలవరం ప్రాజెక్టు: మాజీ మంత్రి దేవినేని ఉమ

జగన్ అవినీతి, నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితిలోకి వెళ్లిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

Published : 19 Jun 2024 15:46 IST

అమరావతి: జగన్ అవినీతి, నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితిలోకి వెళ్లిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైకాపా హయాంలో పనిచేసిన మంత్రులు తమకు అసలు ప్రాజెక్టు కట్టే తీరే అర్థం కాలేదని చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఐదేళ్లలో ఎలాంటి పురోగతి లేకపోగా.. కనీసం రక్షణ చర్యలు కూడా తీసుకోకుండా కట్టిన నిర్మాణాలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. 

2020లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే నాలుగేళ్లుగా దానిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేస్తామని గతంలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్ టెండరింగ్‌ నాటకమాడారని ఆరోపించారు. ప్రజా శ్రేయస్సు గురించి ఆయన పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జగన్‌ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను దేవినేని ఉమామహేశ్వరరావు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని