Panchumarthi anuradha: పోలవరాన్ని జగన్‌ అధోగతి పాల్జేశారు: ఎమ్మెల్సీ అనురాధ

ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్‌ అధోగతి పాల్జేశారని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు.

Published : 18 Jun 2024 15:51 IST

అమరావతి: ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్‌ అధోగతి పాల్జేశారని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పనులు 72 శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఒక్క రోజులో 35 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. అయిదేళ్లు అధికారంలో ఉన్న జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కమీషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. సకాలంలో పోలవరం పూర్తయి ఉంటే 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాకు కూడా నీళ్లిచ్చే స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ఉండేదని తెలిపారు. రాబోయే రోజుల్లో పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేది చంద్రబాబేనని ఉద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని