బండి సంజయ్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట జిల్లా గుర్రంబోడు వివాదాస్పద భూముల వద్ద ఆదివారం జరిగిన ఘర్షణలో మొత్తం 21 మందిపై పోలీసులు కేసు

Published : 09 Feb 2021 01:51 IST

మరో 20మంది పైనా నమోదు చేసిన పోలీసులు
గుర్రంబోడు ఘటనపై చర్యలు

ఈనాడు, నల్గొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట జిల్లా గుర్రంబోడు వివాదాస్పద భూముల వద్ద ఆదివారం జరిగిన ఘర్షణలో మొత్తం 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, సూర్యాపేట జిల్లా భాజపా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డితో పాటు మొత్తం 21 మందిపై మఠంపల్లి ఠాణాలో పోలీసులు పలు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసినట్లు సూర్యాపేట ఎస్పీ భాస్కరన్‌ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బొబ్బ భాగ్యరెడ్డితో పాటు మరో ఆరుగురిని సోమవారం కోదాడ మెజిస్ర్టేట్‌ ముందు పోలీసులు హాజరు పరిచారు. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని