Chandrababu Arrest: తెదేపా భారీ ప్రదర్శన.. 35 మంది నేతలపై కేసులు నమోదు

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బాపట్ల జిల్లాలో నిరసన తెలిపిన నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Published : 19 Sep 2023 21:56 IST

బాపట్ల: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శిలో తెదేపా భారీ ప్రదర్శన నిర్వహించింది. చట్టాలు ఉల్లంఘించారంటూ 35మంది తెదేపా నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరికొందరిపైనా మార్టూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టారు. ఏలూరి సాంబశివరావు, డోల బాల వీరాంజనేయస్వామి, ఇంటూరు నాగేశ్వరరావు, ఎరిక్షన్‌బాబు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడంపై తెలుగు ప్రజలు భగ్గుమంటున్నారు. జగన్‌ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందంటూ మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎక్కడికక్కడ ప్రదర్శనలు, ర్యాలీలతో చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ నిరసనల్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోన్న వైకాపా సర్కార్‌.. పోలీసులను ప్రయోగించి పలుచోట్ల నేతలు, తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని