Cm Kcr: బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో దళిత్‌ సదస్సు: సీఎం కేసీఆర్‌

వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. త్వరలోనే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న దళిత సోదరులతో హైదరాబాద్‌లో దళిత్‌ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.

Updated : 06 Oct 2022 19:53 IST

హైదరాబాద్: వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ప్రగతిభవన్‌లో ఇవాళ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తమిళనాడు వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్‌ సహా పలువురు నేతలు కేసీఆర్‌ను కలిసి బీఆర్‌ఎస్‌ ఏర్పాటుపై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న దళిత సోదరులతో హైదరాబాద్‌లో దళిత్‌ సదస్సు నిర్వహిస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి తిరుమావళవన్‌ అడిగి తెలుసుకున్నారు. ఎస్సీలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావట్లేదని.. తెలంగాణలో అమలవుతోన్న దళితబంధు గొప్ప పథకం అని  కొనియాడారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని