Ponguleti: దమ్ముంటే నన్ను భారాస నుంచి సస్పెండ్‌ చేయండి: పొంగులేటి

గడిచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ (KCR) ప్రభుత్వం పేదలకు ఏం చేసిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy)  ప్రశ్నించారు. దమ్ముంటే తనను భారాస నుంచి సస్పెండ్‌ చేయాలని అన్నారు.

Updated : 06 Feb 2023 17:30 IST

భద్రాద్రి: దమ్ముంటే తనను భారాస (BRS) నుంచి సస్పెండ్‌ చేయాలని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ (KCR) ప్రభుత్వం పేదలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేటలో అశ్వారావుపేట నియోజకవర్గ కార్యకర్తలతో ఇవాళ ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన భారాస సభకు జనాన్ని ఎలా తరలించారో అందరికీ తెలుసన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటానని చెప్పారు. తన కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.

ఆదివారం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పొంగులేటితో పాటు నియోజవర్గానికి చెందిన పలువురు భారాస ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరైన సంగతి తెలిసిందే. అయితే,  భారాస అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పొంగులేటి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారంటూ.. పలువురిపై పార్టీ ఆయా మండలాల నాయకులు బహిష్కరణ వేటు వేశారు. దాదాపు 20 మందిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పొంగులేటి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని