Telangana News: వైఎస్‌ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ

భారాసతో దూరం పెరుగుతున్న క్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో  పొంగులేటి భేటీ అయ్యారు.

Published : 24 Jan 2023 17:59 IST

హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయినట్టు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. గత కొంత కాలంగా భారాస అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న పొంగులేటి ... తాజాగా వైఎస్‌ షర్మిలతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైతెపాలో చేరే విషయంపై స్పష్టత లేదని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

పొంగులేటి అడుగులు ఎటువైపు?

భారాసతో దూరం పెరుగుతున్న క్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖమ్మంలో ఇటీవల జరిగిన భారాస ఆవిర్భావ సభకు గైర్హాజరైన పొంగులేటి.. తన వర్గం నేతలు, అనుచరుల్లో ఆత్మస్థైర్యం నింపేలా తదుపరి కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యనేతలు, వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఖమ్మంలోని తన ఇంట్లో పొంగులేటి శనివారం సమావేశమయ్యారు. భారాసలో కొనసాగేందుకు ఏమాత్రం అవకాశం లేదని ముఖ్య అనుచరుల భేటీలో ఆయన ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం. తదుపరి రాజకీయ నిర్ణయంపై అందరి అభిప్రాయాలు సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది. ఏ పార్టీలోకి వెళ్తే భవిష్యత్తు బాగుంటుందనే అంశంపై ఆరా తీశారని సమాచారం. నియోజకవర్గాల వారీగా ఆత్మీయ భేటీలు కొనసాగించాలని పొంగులేటి నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని