Ponguleti Srinivasa Reddy: త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తా: పొంగులేటి
నాలుగైదు రోజుల్లో ఏ పార్టీలో చేరుతానో చెప్తాను అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఖమ్మం: నాలుగైదు రోజుల్లో ఏ పార్టీలో చేరుతానో చెబుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో పొంగులేటి భేటీ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజలు, అనుచరుల అభిప్రాయాలు తీసుకున్నాను. ఏ పార్టీలో చేరాలనే విషయమై అనుచరుల అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటాను. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తాను. ఖమ్మం బహిరంగ సభ తేదీలనూ త్వరలో వెల్లడిస్తాను’’ అని పొంగులేటి చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్యనాయకులు, అనుచరుల్లో అత్యధిక మంది కాంగ్రెస్‌లో చేరాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయనతోపాటు మాజీ మంత్రి జూపల్లి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కలిసి వచ్చే నేతలందరూ ఒకేసారి కాంగ్రెస్ గూటికి చేరతారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vivo Y56: వివో వై56లో కొత్త వేరియంట్.. ధర, ఫీచర్లలో మార్పుందా?
-
Canada: అందరూ చూస్తున్నారు.. పోస్టర్లు తొలగించండి..: కెనడా హడావుడి
-
IND w Vs SL w: ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు స్వర్ణం..
-
Indian Air Force: వాయుసేన చేతికి తొలి సీ-295 విమానం..!
-
CTET results: సీటెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
Asian Games: ఆసియా క్రీడలు.. ముమ్మరంగా డోపింగ్ టెస్టులు.. ఏ క్షణమైనా ఎవరినైనా పిలుస్తాం: ఓసీఏ