‘ఆ ఎత్తిపోతలతో ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం’

రాయలసీమ ఎత్తిపోతలపై ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated : 11 Jul 2021 12:19 IST

సీఎం జగన్‌కు లేఖ రాసిన తెదేపా ఎమ్మెల్యేలు

అమరావతి: రాయలసీమ ఎత్తిపోతలపై ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంపుపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, బాల వీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ, సీమ ఎత్తిపోతల వల్ల జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుంది. పంట భూములన్నీ భూగర్భజలాలు, సాగర్‌పైనే ఆధారపడ్డాయి. శ్రీశైలం నిండకుండా ప్రాజెక్టులు కడితే మా పరిస్థితేంటి?గుంటూరు ఛానల్‌ దగ్గుబాడు వరకు పొడిగించి పొలాలకు నీళ్లివ్వాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లాలో 15 ఏళ్లలో మూడు సార్లే సాధారణ వర్షపాతం నమోదైందని.. పన్నెండేళ్లు కరవే అని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలతో మరింత చేటు జరిగేలా ఉందని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంపు విషయంలో పునరాలోచించాలని ఎమ్మెల్యేలు సీఎంను కోరారు.  


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు