Politics: పవార్‌తో పీకే రెండోసారి భేటీ..ఎందుకో?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సోమవారం ఎన్‌సీపీ అధినేత  శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. వీరివురు సమావేశం కావడం గత రెండు వారాల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. జూన్‌ 11న ముంబయిలోని పవార్‌ నివాసంలో తొలిసారి భేటీ అయిన వీరు.....

Published : 22 Jun 2021 01:46 IST

దిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సోమవారం ఎన్‌సీపీ అధినేత  శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. వీరివురు సమావేశం కావడం గత రెండు వారాల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. జూన్‌ 11న ముంబయిలోని పవార్‌ నివాసంలో తొలిసారి భేటీ అయిన వీరు..  ఈసారి దిల్లీలో అరగంట పాటు చర్చించుకున్నట్లు సమాచారం. అయితే, ఏ విషయంపై చర్చించారన్నది అధికారికంగా తెలియకపోయినప్పటికీ.. మిషన్‌ 2024 లక్ష్యంగానే మంతనాలు జరిగి ఉంటాయని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీని దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. 

మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో దీనిపైనే ప్రశాంత్‌ కిశోర్‌ ఆయనతో భేటీ అయ్యారేమోనన్న ప్రశ్నలు మొదలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రశాంత్‌ కిశోర్‌ ఆయనకు సూచించినట్టు తొలిసారి భేటీ అనంతరం రాజకీయ వర్గాల్లో వినిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని