Prashant Kishor: రాహుల్‌ యాత్ర తీరుపై ప్రశాంత్‌ కిశోర్‌ వ్యంగ్యాస్త్రాలు

ప్రశాంత్‌ కిశోర్‌ బిహార్‌లో జన సురాజ్‌ పేరిట పాదయాత్ర చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి, భారత్‌ జోడో యాత్రకు ఉన్న సారూప్యతలపై ప్రశ్నించగా.. కిశోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 08 Jan 2023 12:16 IST

మోతీహరి: భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేస్తున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)తో పోలిస్తే తాను చాలా చిన్నవాడినని ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) అన్నారు. ప్రస్తుతం కిశోర్‌ సైతం బిహార్‌లో ‘జన్‌ సురాజ్‌’ పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇరువురి యాత్ర మధ్య ఏమైనా సారూప్యతలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్‌ (Rahul Gandhi) యాత్ర తీరుపై ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘రాహుల్‌ గాంధీ 3,500 కి.మీ సుదీర్ఘ యాత్రలో ఉన్నారు. నాకు దూరంతో సంబంధం లేదు. అక్టోబరు నుంచి నేను విరామం లేకుండా నడుస్తున్నాను. దీన్ని నేను నా శారీరక దృఢత్వాన్ని నిరూపించుకోవడానకి చేయడం లేదు. ఇంటికి వెళ్లడం లేదు. కొత్త సంవత్సరం సందర్భంగా విశ్రాంతి తీసుకోవడం లేదు. తర్వాతి ప్రదేశాన్ని చేరుకోవడానికి మధ్య మధ్యలో వాహనంపై ప్రయాణించడానికి కూడా నేను అంగీకరించను’’ అంటూ పరోక్షంగా రాహుల్‌ యాత్ర తీరును ఎద్దేవా చేశారు. బిహార్‌లో రాజకీయ నాయకులు తనని అవకాశవాదిగా అభివర్ణిస్తుండటంపై స్పందిస్తూ.. తన యాత్ర ఉద్దేశం మాత్రం స్వచ్ఛమైందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని