
Prashant Kishor: గుజరాత్, హిమాచల్‌లోనూ కాంగ్రెస్‌కు ఓటమే.. పీకే అంచనా..!
ఇంటర్నెట్‌డెస్క్: వరుస ఓటములతో సతమతమవుతోన్న కాంగ్రెస్.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘చింతన్ శివిర్’ నిర్వహించింది. ఈ కార్యక్రమంపై తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. అదో విఫల ప్రయత్నమని పేర్కొన్నారు. అంతేగాక, గుజరాత్, హిమాచల్ప్రదేశ్ల్లోనూ ఆ పార్టీకి ఓటమి తప్పేలా లేదని అంచనా వేశారు.
‘‘ఉదయ్‌పూర్ చింతన్ శివిర్ గురించి మాట్లాడాలరి నన్ను పదే పదే అడుగుతున్నారు. నా అభిప్రాయంలో అదో విఫలమైన ప్రయత్నం. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల ఓటమి వరకు కాంగ్రెస్ అధినాయకత్వానికి సమయం ఇవ్వడం, యథాతథ స్థితిని మరింత కాలం కొనసాగించడానికి తప్ప అర్థవంతమైన పరిష్కారాన్ని సాధించడంలో ఆ శిబిరం విఫలమైంది’’ అని పీకే వ్యాఖ్యానించారు.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి కాంగ్రెస్‌కు పునర్ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా గతవారం కాంగ్రెస్ నవ సంకల్ప చింతన శిబిరం నిర్వహించింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు ఈ శిబిరంలో ప్రసంగించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అయితే కాంగ్రెస్ నాయకత్వంపై గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించేలా ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం.
ఈ శిబిరానికి కొద్ది వారాల ముందే కాంగ్రెస్, ప్రశాంత్ కిశోర్ మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. పీకేను అధిష్ఠానం పార్టీలోకి ఆహ్వానించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే. పార్టీ పునర్వ్యవస్థీకరణ కోసం తాను రూపొందించిన ప్రణాళికల అమలుకు అవసరమైన స్వేచ్ఛను, కీలక పదవిని ఇచ్చేందుకు నాయకత్వం ససేమిరా అనడంతో ప్రశాంత్ కిశోర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చింతన్ శివిర్‌పై పీకే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Child Marriages: వచ్చే పదేళ్లలో కోటి మందికి బాల్యవివాహాలు
-
Viral-videos News
Viral video: వారెవ్వా.. ఏం ట్యాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
-
Related-stories News
Corona: ‘దక్షిణ’ బెలూన్లే కరోనాను మోసుకొచ్చాయి
-
Related-stories News
Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
-
Ap-top-news News
Andhra News: ఎన్నికైనప్పటి నుంచి సచివాలయంలో కూర్చోనివ్వలేదు.. సర్పంచి నిరసన
-
Ap-top-news News
Andhra News: వినూత్నంగా గుర్రంతో సాగు పనులు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- IND vs ENG: ఆదుకున్న పంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ