Updated : 27 Feb 2022 17:31 IST

CM Kcr: సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్‌ కిశోర్ భేటీ ... రాజకీయ వర్గాల్లో ఆసక్తి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన వేళ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రాష్ట్ర పర్యటన ఆసక్తి రేపుతోంది. రెండ్రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌... సీఎం కేసీఆర్‌ను ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. దేశ వ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, కేసీఆర్‌ ఆలోచనలు, వ్యాఖ్యలపై ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) బృందం వివిధ రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ అభిప్రాయాలు సేకరిస్తోంది.

తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన ప్రశాంత్‌ కిశోర్‌ సంబంధిత అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఇటీవల కేసీఆర్‌ ముంబయి  పర్యటనలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో చర్చల సారాంశం, తదితర అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఇరువురూ చర్చించినట్టు సమాచారం. సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి  కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్‌ సూచనలమేరకు ప్రశాంత్‌ కిశోర్‌, ప్రకాశ్‌ రాజ్‌ ఇరువురూ మల్లన్న సాగర్‌ జలాశయం, పంప్‌ హౌస్‌ సహా.. గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఆయా వర్గాల అభిప్రాయాలను కూడా ప్రశాంత్‌ కిశోర్‌ తెలుసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని