TDP: తెదేపా ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున సన్నాహాలు

తెదేపా 42వ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు  కాసాని తెలిపారు.

Published : 26 Mar 2023 23:50 IST

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఈనెల 29 తేదీన నిర్వహించనున్న సభకు ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. సభకు సంబంధించిన ఏర్పట్లను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, ఆ పార్టీ సీనియర్‌ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర నాయకులు ఆదివారం పరిశీలించారు. 28వ తేదీ ఎన్టీఆర్‌ భవన్‌లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పొలిట్‌బ్యూరో ప్రతినిధుల సభ, 29న రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధుల సభ జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు, ఇప్పుడు ప్రభుత్వం ఏమి చేసిందనే విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు 2020 విజన్‌ ఫలితాలు ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీకి  ఈ సభ ఒక చారిత్రకమైన సభగా ఆ పార్టీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అభివర్ణించారు. ఈ సభ ద్వారా ప్రపంచంలోని తెలుగు వారికి ఒక సందేశం, సంకేతం పంపుతామని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని