Andhra News: ప్రధాని మేకప్‌ ఖర్చు నెలకు రూ. 70 లక్షలు

తక్కువ స్థానాల్లో గెలిచినా, ప్రభుత్వాలను పడగొట్టి ఎనిమిది రాష్ట్రాలలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన మోదీ హైదరాబాద్‌ వస్తున్నారని, ఆయన తీరును భాజపా సమర్థిస్తుందా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

Updated : 02 Jul 2022 09:25 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: తక్కువ స్థానాల్లో గెలిచినా, ప్రభుత్వాలను పడగొట్టి ఎనిమిది రాష్ట్రాలలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన మోదీ హైదరాబాద్‌ వస్తున్నారని, ఆయన తీరును భాజపా సమర్థిస్తుందా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలుస్తున్న నేపథ్యంలో ఫెడరల్‌ స్ఫూర్తి అంటే తమకు ఇష్టం లేదని భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేయాలని సూచించారు. మోదీ హయాంలో 25 మంది రూ.25 లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారని, గత ప్రభుత్వాలు రూ.40 లక్షల కోట్లు అప్పు చేస్తే, మోదీ ఆ మొత్తాన్ని రూ.85 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. ఈ చర్యలన్నింటినీ భాజపా ఆమోదిస్తుందా అని నిలదీశారు. గతంలో ఏ ప్రధానీ మేకప్‌ కోసం నెలకు రూ.70 లక్షలు ఖర్చుచేయడం చూడలేదని, మోదీ తాను సన్యాసిగా పేర్కొంటూనే విలాసాలు, అలంకరణలకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో నంబర్‌వన్‌ క్రిమినల్‌ అమిత్‌ షా అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు