PM Modi: ఎన్డీయే కూటమి ఏపీ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది: ప్రధాని మోదీ

తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆంధ్రప్రదేశ్‌ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

Published : 12 Jun 2024 15:13 IST

అమరావతి: తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆంధ్రప్రదేశ్‌ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఏపీలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ‘‘ఏపీ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యా. సీఎంతో పాటు ప్రమాణం చేసిన మంత్రులందరికీ అభినందనలు. రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు