Politics: మోదీజీ.. అది దేశానికి మంచిది కాదు: త్వరలో లేఖ రాస్తానన్న స్టాలిన్‌

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌ (ఎన్‌ఎంపీ)పై తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ విమర్శలు గుప్పించారు.  ప్రభుత్వ ఆధీనంలోని ఆస్తులను ప్రయివేటీకరించడం.......

Published : 03 Sep 2021 01:50 IST

చెన్నై: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌ (ఎన్‌ఎంపీ)పై తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ విమర్శలు గుప్పించారు.  ప్రభుత్వ ఆధీనంలోని ఆస్తులను ప్రయివేటీకరించడం లేదా లీజుకు ఇవ్వడం దేశ సంక్షేమానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ)ను ప్రయివేటీకరించే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని గురువారం ఆయన అసెంబ్లీలో స్పష్టంచేశారు.

దేశంలోని పీఎస్‌యూలు ప్రజా ఆస్తులని, ఇవి ఆర్థిక వృద్ధిని పెంపొందించడంతో పాటు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూపొందించబడ్డాయన్నారు. ఈ సంస్థలు చిన్న, సూక్ష్మ సంస్థలకు పునాదిలాంటివన్నారు. పీఎస్‌యూలను అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం దేశ ప్రయోజానాలకు మంచిది కాదని తమ అభిప్రాయమని తెలిపారు.  ప్రభుత్వరంగసంస్థలు విశాలమైన ప్రజా సంక్షేమాన్ని, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాయి తప్ప వ్యాపారం చేయడం వాటి లక్ష్యం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పీఎస్‌యూల ప్రైవేటీకరణను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయాన్ని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీకి త్వరలోనే లేఖరాస్తానని స్టాలిన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని