కొంతమంది లబ్ధికి ఇది మరో ప్రయత్నం: ఖర్గే

దిల్లీ: బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై రాజ్యసభ ప్రధాన విపక్ష నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. వారి (భాజపా) మిత్రులైన కొంత మందికి లబ్ధి చేసేందుకు బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది మరో ప్రయత్నమని దుయ్యబట్టారు. దిల్లీలోని..

Published : 16 Mar 2021 19:48 IST

దిల్లీ: బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై రాజ్యసభ ప్రధాన విపక్ష నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. వారి (భాజపా) మిత్రులైన కొంత మందికి లబ్ధి చేసేందుకు బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది మరో ప్రయత్నమని దుయ్యబట్టారు. దిల్లీలోని విజయ్‌ చౌక్‌ వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ హయాంలో పేదల మేలు కోసమని 14 బ్యాంకులను జాతీయం చేస్తే, ప్రస్తుతం పలువురి లబ్ధి కోసం వాటిని ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తున్నారని చురకలు అంటించారు. ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లినా.. భారత్‌ దానిని అధిగమించి నిలబడటానికి కేంద్ర బ్యాంకుల కృషే కారణమని ఈ సందర్భంగా ఖర్గే గుర్తు చేశారు. దాదాపు 9 యూనియన్లకు చెందిన 13 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ప్రైవేటీరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారని పేర్కొన్నారు. వారి మనోభావాలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఏ మాత్రం తగదన్నారు. ప్రజలు సైతం ఈ నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. కాగా, జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకింగ్‌ రంగంలోని 9 కార్మిక సంఘాల ఐక్య వేదిక (యూఎఫ్‌ఒబియూ) రెండు రోజుల అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని