West bengal: మమత గెలిచినా.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ నాదే!

పశ్చిమబెంగాల్‌లోని భవానీపూర్‌ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ విజయం సాధించినా.. ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ మాత్రం తనదే అంటున్నారు భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌.

Published : 04 Oct 2021 01:05 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని భవానీపూర్‌ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ విజయం సాధించినా.. ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ మాత్రం తనదే అంటున్నారు భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌. మమత వంటి గట్టి అభ్యర్థితో పోటీ పడి 25వేలకు పైగా ఓట్లు సాధించడం అంటే గొప్ప విషయమని చెప్పారు. ఈ మేరకు ఫలితాల అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ఉప ఎన్నికలో ఓటమిని అంగీకరిస్తున్నానని, ఫలితంపై కోర్టుకు వెళ్లబోనని ప్రియాంక చెప్పారు. భవిష్యత్‌లో ఇదేవిధంగా కష్టపడతానని అన్నారు. లక్ష ఓట్లు సాధిస్తానని చెప్పిన మమతను కేవలం 50వేల మెజార్టీకే పరిమితం చేశానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విజయం సాధించిన మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, అయితే, ఆమె ఏ విధంగా ఎన్నికల్లో గెలుపొందారో అందరూ చూశారని చెప్పారు.

నందిగ్రామ్‌లో ఓటమితో భవానీపూర్‌ నుంచి మమత పోటీ చేసిన సంగతి తెలిసిందే. అందుకు వీలుగా భవానీపుర్‌ నుంచి గెలుపొందిన శోభన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. తెలిసిందే. ఈ ఎన్నికలో 58 వేలకు పైగా ఓట్లను సాధించారు. మరోవైపు పశ్చిమబెంగాల్లో జరిగిన మరో రెండు స్థానాల్లోనూ (శంషేర్‌గంజ్‌, జాంగిపూర్‌లోనూ) తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయఢంకా మోగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని