బతుకమ్మ పండుగతో ఇందిరాగాంధీకి అనుబంధం.. గుర్తు చేసుకున్న ప్రియాంక

తెలంగాణలో బతుకమ్మ సంబురాలు 3వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా.. తెలంగాణ...

Updated : 27 Sep 2022 18:13 IST

దిల్లీ: తెలంగాణలో బతుకమ్మ సంబురాలు 3వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా.. తెలంగాణ ప్రజలందరికీ, ప్రత్యేకంగా ఆడపడుచులకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ ట్విటర్‌ వేదికగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ అప్పటి ఫొటోను ట్విటర్లో షేర్‌ చేశారు. 1978లో ఓరుగల్లులో నిర్వహించిన బతుకమ్మ  సంబురాల్లో తన నానమ్మ ఇందిరాగాంధీ పాల్గొనడం ఒక మధుర స్మృతి అని పేర్కొన్నారు. ప్రకృతిని ప్రేమిస్తూ, పువ్వులను పేర్చి ఊరూ వాడా కలిసి చేసుకునే ఈ పండుగ రాష్ట్ర ప్రజలకు ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేయాలని కోరుకుంటున్నట్టు   ట్విటర్‌లో వెల్లడించారు.  

మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా... ఇంటింటా మహిళలు ఉత్సాహంగా పండుగలో పాల్గొంటున్నారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. ఊళ్లన్నీ బతుకమ్మలతో మురిసిపోయాయి. తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి రాగయుక్తమైన పాటలకు లయబద్ధమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని