Telangana News: అక్కడెందుకు సీఎం కేసీఆర్‌ పర్యటించలేదు?: కోదండరామ్‌

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలు, జరిగిన అవినీతిపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్

Updated : 13 Aug 2022 14:24 IST

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలు, జరిగిన అవినీతిపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో రణ దీక్ష చేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. కోదండరామ్‌ మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నష్టపోయినవారిని తక్షణమే ఆదుకోవాలి. ప్రాజెక్టు డిజైన్ లోపం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. గవర్నర్ భద్రాచలం వెళుతున్నారని  తెలిసి పోటీగా ముఖ్యమంత్రి అక్కడ పర్యటించారు. మరి మేడిగడ్డ, మంచిర్యాల ప్రాంతాలను సీఎం ఎందుకు సందర్శించలేదు? బాధితులను ఆదుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. సంతకాల సేకరణ, వినతి పత్రాల సమర్పణతోపాటు అవసరమైతే పాదయాత్ర చేస్తాం’’ అని కోదండరామ్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని