Andhra News: విద్యుత్‌ ఛార్జీల ‘బాదుడు’పై ఏపీ వ్యాప్తంగా నిరసనలు

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టాయి. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశాయి.

Updated : 31 Mar 2022 16:03 IST

అమరావతి: ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశాయి. ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.కడపలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రజలపై మరో రూ.4వేల కోట్లు భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని రామకృష్ణ ఆరోపించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచిందన్నారు. విద్యుత్‌ ఛార్జీలను పెంచడం దుర్మార్గమని ఆయన చెప్పారు. వామపక్షాలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు నిరసన తెలిపాయి. విజయవాడలో తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ వినూత్నంగా నిరసన తెలిపారు. విద్యుత్‌ ఛార్జీలు కట్టేందుకు దానం ఇవ్వాలంటూ భిక్షాటన చేశారు. 

 ఏలూరులో వామపక్షాలు నిరసన చేపట్టాయి. శ్రీకాకుళం అంబేడ్కర్‌ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట వామపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. విద్యుత్‌ ధరలు తగ్గించాలని విశాఖలో సీపీఎం, అనుబంధ సంఘాలు నిరసన తెలిపాయి. ఏపీఈపీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించాయి. కర్నూలులో వామపక్ష నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరులో సీపీఐ నాయకులు నిరసన తెలిపారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు