Published : 19 Feb 2022 14:21 IST

Charanjit Channi: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. పంజాబ్‌ సీఎం చన్నీపై కేసు

చండీగఢ్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతోపాటు గాయకుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి శుభ్‌దీప్‌ సింగ్‌(సిద్ధూ మూసేవాలా)పై తాజాగా కేసు నమోదైంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే.. చివరి రోజు గడువు ముగిసినా.. వారు ఇక్కడి మాన్సా నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు ఆప్‌ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శనివారం ఇద్దరు నేతలపై ఈ మేరకు కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై స్థానిక రిటర్నింగ్ అధికారి హర్జీందర్ సింగ్ ఓ వార్తాసంస్థతో మాట్లాడారు.

‘గడువు ముగిసినా.. సీఎం ప్రచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నా. అయితే, సీఎం అప్పటికే వెళ్ళిపోయారు. స్థానికులను విచారించగా.. ఆయన గురుద్వారా, ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఫ్లయింగ్‌ సర్వైలెన్స్‌ టీం(ఎఫ్‌ఎస్‌టీ) వీడియోలను తనిఖీ చేసి, తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. ప్రముఖ పంజాబీ గాయకుడైన సిద్ధూ మూసేవాలా.. ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున మాన్సా నుంచి బరిలోకి దిగారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలకు ఈ నెల 20న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని