Punjab Politics: అమరీందర్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు..!

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ భాజపాలో చేరిక దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. నిన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవడంతో ఈ ఊహాగానాలకు

Published : 30 Sep 2021 11:57 IST

దిల్లీ: పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ భాజపాలో చేరిక దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. నిన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. దీంతో మేలుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. కెప్టెన్‌ భాజపాలో చేరకుండా ఉండేలా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ బాధ్యతను సీనియర్‌ నేతలు అంబికా సోని, కమల్‌నాథ్‌లకు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఈ నేతలు అమరీందర్‌ సింగ్‌కు సన్నిహితులు. దీంతో కెప్టెన్‌కు సర్దిచెప్పి తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు అమరీందర్‌ సిద్ధంగా లేరని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో తనకు జరిగిన అవమానాన్ని.. కమల్‌నాథ్‌, అంబికా సోనిల వద్ద కెప్టెన్‌ మరోసారి ప్రస్తావించినట్లు సదరు వర్గాల సమాచారం. మరోవైపు భాజపాలో చేరికపై అమరీందర్‌ సింగ్‌ నుంచి మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు. నూతన సాగు చట్టాలపై చర్చించేందుకే అమిత్ షాతో సమావేశమైనట్లు భేటీ తర్వాత ఆయన ట్వీట్‌ చేయడం గమనార్హం. 

అజిత్‌ ఢోబాల్‌తో అమరీందర్‌ భేటీ..

ఇదిలా ఉండగా.. దిల్లీ పర్యటనలో ఉన్న అమరీందర్‌ సింగ్‌ గురువారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌తో భేటీ అయ్యారు. ఈ ఢోబాల్‌ నివాసానికి వెళ్లిన కెప్టెన్‌.. ఆయనతో సమావేశమయ్యారు. దిల్లీ పర్యటనలో భాగంగా కొంతమంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతోనూ అమరీందర్‌ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని