PV Ramesh: నీతి ఆయోగ్‌ చెప్పిందదే.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై పీవీ రమేష్‌ కీలక వ్యాఖ్యలు

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్‌ పీవీ రమేష్‌ ధన్యవాదాలు తెలిపారు.

Updated : 16 Jun 2024 13:37 IST

అమరావతి: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్‌ పీవీ రమేష్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు పెట్టారు. గతంలో తన తండ్రి పట్టా భూమి మ్యుటేషన్‌కు అధికారులు నిరాకరించారని తెలిపారు. ఆర్డీవోకు పోస్టులో పంపిన పత్రాలను తిరిగి వెనక్కు పంపారని చెప్పారు. చట్టం రాకముందే భూములపై హక్కులు నిరాకరించారని పేర్కొన్నారు. తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్యులు చట్టంతో ఏమైపోతారో అని గతంలోనూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌ మంచిదేనని ఇంకా జగన్‌ చెప్పడంపై తాజాగా పీవీ రమేష్‌ స్పందించారు. యాక్ట్‌ ఏపీలో అవసరమే ఉండదంటూ ఆధారాలతో సహా స్పష్టతనిచ్చారు. సెక్యూర్‌ టైటిల్‌ లేని భూములకు అమలు చేయాలని నీతి ఆయోగ్‌ సూచించిందన్నారు. అవగాహన లోపంతో గత ప్రభుత్వం చట్టం తెచ్చిందని పీవీ రమేష్‌ విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని