50వేల మంది నిరాశ్రయులయ్యారు: పవన్

గోదావరి ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పసిపిల్లలకు పాలు కూడా దొరకడం లేదన్నారు.

Published : 23 Aug 2020 02:36 IST

అమరావతి: గోదావరి ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పసిపిల్లలకు పాలు కూడా దొరకడం లేదన్నారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరిచి సరైన వైద్యం అందించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ముంపు ఇంతలా ఉండేది కాదన్న ఆయన త్వరితగతిన ప్రాజెక్టు పనులు చేయాలని కోరారు.

200 లంక గ్రామాలు మునిగిపోయాయని పవన్‌కల్యాణ్‌ వివరించారు. దీంతో 50వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని తెలిపారు. వైద్యులు అందుబాటులో లేరని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో చిన్న పిల్లలు పాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అత్యవసర వస్తువుల జాబితాలో పాలు కూడా చేర్చాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన  కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని