అమరావతి కన్నీటి వెతలు ఇంకెన్నాళ్లు?

ఏపీ రాజధాని అమరావతి కోసం ఎంత ఖర్చుచేశారో పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించండం మంచి పరిణామమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు...

Published : 07 Aug 2020 14:20 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ : ఏపీ రాజధాని అమరావతి కోసం ఎంత ఖర్చుచేశారో పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించండం మంచి పరిణామమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొందరు నేతలు హైకోర్టుపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని, సంయమనం పాటించాలని సీఎం కోరితే బాగుంటుందన్నారు.

‘‘ఒక మాజీ న్యాయాధికారి సంభాషణలు బయటకు వచ్చాయి...అలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వానికి మంచిది కాదు. న్యాయస్థానాలను అందరూ గౌరవించాలి. రాజధానిపై సోము వీర్రాజు చేసిన కామెంట్‌ సరైంది కాదు. అమరావతిలో రాజధాని వస్తుందని సామాన్య, మధ్యతరగతి ప్రజలు చాలా మంది చిన్న చిన్న ఫ్లాట్స్‌ కొనుక్కున్నారు. దయచేసి వారికి ఇబ్బంది కలిగించొద్దు. సీఎం జగన్‌ ఒక్కసారి ఇలాంటి విషయాలపై కూడా ఆలోచించాలి. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కూడా అమరావతిలో స్థలాలు కొనుక్కున్నారు.. ప్రస్తుతం ఏపీలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో రాజధాని మార్పు సరికాదు. రైతులకు న్యాయం చేయాలంటే రూ.80వేల కోట్లు అవసరం. రాజధాని తరలించి రైతులకు ఏవిధంగా న్యాయం చేయగలరు. అమరావతి కన్నీటి వెతలు ఇంకెన్నాళ్లు? రాజధాని లేకుండా రైతుల కష్టాలు ఎలా తీరుస్తారు?’’ అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని