Raghurama: నా శ్రేయోభిలాషుల కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నా: రఘురామ

ప్రధాని నరేంద్రమోదీ భీమవరం పర్యటనకు తాను హాజరుకావడం లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.

Updated : 04 Jul 2022 10:51 IST

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ భీమవరం పర్యటనకు తాను హాజరుకావడం లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బయల్దేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం రాత్రి అర్ధంతరంగా వెనుదిరిగారు. బేగంపేట రైల్వేస్టేషన్‌లో ఆయన దిగిపోయారు. ఈ క్రమంలో తన భీమవరం పర్యటన రద్దుకు గల కారణాలపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

‘‘భీమవరంలో నా అనుచరులు కొందరిపై ఇప్పటికే  పలు కేసులుండటంతో సుమారు 55 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి చిత్రహింసలు పెడుతున్నారు. ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. నేను వెళ్తే ఇంకా ఇబ్బంది పెడతామని వారికి చెబుతున్నారు. నేను భీమవరం వెళ్లకపోతే వాళ్లను వదిలేస్తామని పోలీసులు చెప్పారు. తన శ్రేయోభిలాషుల శ్రేయస్సు కోరి ఒక అడుగు వెనక్కి వేయదలుచుకున్నా. నా కోసం ఎవరూ భీమవరం రావొద్దు’’ అని రఘురామ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని