జగన్‌ లక్ష్యం అదే: రఘురామకృష్ణరాజు

తనను అరెస్టు చేయించడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ..

Published : 12 Oct 2020 01:20 IST

దిల్లీ: తనను అరెస్టు చేయించడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...  తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించడంలో ప్రవీణ్ ప్రకాశ్‌ అనే అధికారి ఆయన బ్యాచ్‌మేట్‌తో పావులు కదిపి విజయవంతం అయ్యారని ఆరోపించారు. సీఎం దిల్లీ పర్యటనలో రాష్ట్ర సమస్యలను గాలికొదిలేశారన్నారు. తనను అరెస్టు చేయించే వరకు అన్నం కూడా తినేలాలేరనే మంకు పట్టుదలతో సీఎం ఉన్నట్టు తాడేపల్లి వర్గాల నుంచి సమాచారం అందుతుందన్నారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే ప్రవీణ్‌ప్రకాశ్‌ని తెచ్చుకున్నారని విమర్శించారు. 
‘‘ప్రవీణ్ ప్రకాశ్‌ ముఖ్యమంత్రికి రక్షకుడిగా ఉంటారో, తక్షకుడిగా ఉంటారో చూడాలి. న్యాయవ్యవస్థపై దాడులు జరుగుతున్నాయి. ఈ రకంగా దాడికి పాల్పడటం అశుభపరిణామం. ఆర్టికల్‌ 356 దిశగా ప్రయాణం చేసేలా ఉంది. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధించి ప్రజలకు న్యాయం జరిగే రోజు వస్తుందని ఆశిస్తున్నా’’ అని రఘురామకృష్ణరాజు అన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని