
Published : 10 Oct 2021 01:27 IST
Raghurama: మీ చేతకానితనానికి ప్రతిపక్షాలు, కోర్టులపై నిందలా?: రఘురామ
దిల్లీ: ఏపీలోని జగనన్న కాలనీల్లోని మౌలికవసతుల అంశంలో ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు, కోర్టులపై నిందలు వేయడమేంటని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. శనివారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధిలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వంలో కొంతమంది వక్రభాష్యాలు పలుకుతున్నారన్నారు. కోర్టులు, ప్రతిపక్షాలపై బురద చల్లడం తప్ప చేసిందేమిటని ప్రశ్నించారు. ఆవభూముల వ్యవహారంలో ఇప్పటివరకు చర్యల్లేవని.. ప్రజలు అడిగినప్పుడు, నిలదీసినప్పుడు సమాధానం చెప్పాలన్నారు. నిబంధనలు అనుసరించాలని కోర్టు చెప్పడంలో తప్పేముందన్నారు.
ఇవీ చదవండి
Tags :