అప్పుడైనా కోర్టు మాట వినండి

ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించడం శుభపరిణామమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. న్యాయ వ్యవస్థకు ఈ మధ్య కాలంలో ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేకపోవడంతోనే చాలా పరిణామాలు తలెత్తాయన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన మీడియాతో

Updated : 31 Jul 2020 15:06 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించడం శుభపరిణామమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. న్యాయ వ్యవస్థకు ఈ మధ్య కాలంలో ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేకపోవడంతోనే చాలా పరిణామాలు తలెత్తాయన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ లేటుగా అయినా నిమ్మగడ్డ విషయంలో స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని ఎంపీ చెప్పారు. నూతన జాతీయ విధానం పట్ల ఏపీ ప్రభుత్వం తీరుపై స్పందిస్తూ.. ఈ విద్యా విధానాన్ని సరిగా అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నూతన విద్యా విధానాన్ని వక్రీకరించినా సుప్రీంకోర్టు దాన్ని సరిదిద్దుతుందని.. అప్పుడైనా కోర్టు మాట వినండి అని ఎద్దేవా చేశారు. 

‘‘ప్రభుత్వ నిర్ణయాలతో డీజీపీ కూడా నాలుగు సార్లు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. న్యాయవ్యవస్థను ప్రభుత్వం గౌరవించాలి. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది చనిపోవడం దురదృష్టకరం. కల్తీ మద్యం రాష్ట్రంలోకి ఎక్కువగా వస్తోంది. ఆంధ్ర గోల్డ్‌ పేరిట మద్యం ఎక్కువగా సరఫరా అవుతోంది. పేరున్న మద్యం బ్రాండ్స్‌ ఎక్కువగా ఉన్నా.. రాష్ట్రంలో ఎందుకు దొరకట్లేదన్న అంశంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించాలి. అమ్మ ఒడి డబ్బులు నాన్న ఒడిలోకి వెళ్లిపోతున్నాయి.. అవి తిరిగి మీ దగ్గరికి వస్తున్నాయని సంతోషిస్తున్నారా? మద్యనిషేధం అమలు చేయండి. లేదా సరైన బ్రాండ్లు దొరికేలా చూడండి. కల్తీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది’’అని రఘురామకృష్ణరాజు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని