Andhra news: సీఎం జగన్‌ వ్యాఖ్యలపై సీజేఐకు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్ర చూడ్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.విశాఖ రాజధాని అంటూ సీఎం జగన్‌ ప్రకటన చేసి కోర్టు ధిక్కురణకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు.

Updated : 31 Jan 2023 21:12 IST

దిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్ర చూడ్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. విశాఖ రాజధాని అంటూ సీఎం జగన్‌ ప్రకటన చేసి కోర్టు ధిక్కురణకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చే సమయంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు  చేశారు. న్యాయస్థానంలో ఒక వైపు కేసు విచారణ జరుగుతుండగా ముఖ్యమంత్రి కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నియమ నిబంధనల ప్రకారం ఇది కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగానే ఉంది. సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విధంగా ఉన్నాయి. కోర్టులో విచారణ జరుగుతున్న అంశంపై చేసిన వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకోవాలి’’ సీజేఐకి రాసిన లేఖలో రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.

దిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో నిర్వహించిన ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంగళవారం సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. ‘‘మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నా. విశాఖపట్నం రాజధాని కాబోతోంది. కొన్ని నెలల్లో నేను కూడా అక్కడికి షిఫ్ట్‌ అవుతున్నా. మిమ్మల్ని మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు