‘జగన్‌ ఫొటోతో గెలవలేదు..రాజీనామా చేయను’

ఏపీ ప్రభుత్వం వద్ద ఒక్క రాజధానికే డబ్బుల్లేవు.. మూడు రాజధానులు కావాలా? అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దెవ చేశారు. ఏపీ పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఎంపీ స్పందించారు. ‘‘మూడు రాజధానుల

Updated : 14 Aug 2020 15:21 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: ఏపీ ప్రభుత్వం వద్ద ఒక్క రాజధానికే డబ్బుల్లేవు.. మూడు రాజధానులు కావాలా? అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఏపీ పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఎంపీ స్పందించారు. ‘‘మూడు రాజధానుల అభివృద్ధికి ప్రభుత్వం వద్ద నిధులున్నాయా? బాటా పాదరక్షల రేటులా కేంద్రాన్ని రూ.9.9లక్షల కోట్లు అడుగుతున్నారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థలకు రూ. వేల కోట్ల బిల్లులు ఇవ్వాలి. కేంద్రం ఇచ్చిన డబ్బులు చెల్లించకుంటే రేపోమాపో వారంతా దిల్లీలో ధర్నా చేస్తారు. రాష్ట్రానికి సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఎలా?’’అని ఎంపీ ప్రశ్నించారు.

ఒక సామాజిక వర్గం నాయకులు తనపై మాటల దాడి చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనను రాజీనామా చేయమని పలువురు వైకాపా నేతలు చేస్తున్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ.. జగన్‌ బొమ్మతో తాను గెలవలేదు కాబట్టి రాజీనామా చేయనని ఎంపీ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని