ఆ చట్టాలతో గ్రామీణ ఆర్థికానికి దెబ్బ: రాహుల్‌

దేశంలోని పారిశ్రామికవేత్తలు అపరిమితంగా ఆహారధాన్యాలు కొనుగోలు చేయడానికే నూతన సాగు చట్టాలు ఉపయోగపడతాయని కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆయా చట్టాలను ఉద్దేశిస్తూ ఆయన గురువారం లోక్‌సభలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా దేశాన్ని కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే పరిపాలిస్తున్నారంటూ రాహుల్‌ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. 

Updated : 27 Feb 2024 19:45 IST

దిల్లీ: దేశంలోని పారిశ్రామికవేత్తలు అపరిమితంగా ఆహారధాన్యాలు కొనుగోలు చేయడానికే నూతన సాగు చట్టాలు ఉపయోగపడతాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆయా చట్టాలను ఉద్దేశిస్తూ ఆయన గురువారం లోక్‌సభలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా దేశాన్ని కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే పరిపాలిస్తున్నారంటూ రాహుల్‌ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. 

‘దిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనలకు మా మద్దతు ఉంటుంది. ఇది కేవలం రైతుల ఆందోళన మాత్రమే కాదు.. ఇది దేశవ్యాప్త ప్రజల ఉద్యమం. పారిశ్రామికవేత్తలు అపరిమితంగా ఆహారధాన్యాలు కొనుగోలు చేయడమే ఆ సాగు చట్టాల ఉద్దేశం. కాబట్టి కేంద్రం వాటిని తప్పనిసరిగా రద్దు చేయాలి. ఈ నూతన సాగు చట్టాలు దేశంలో ఆహార భద్రతను కొల్లగొట్టేవిధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఆ చట్టాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, చిన్న, మధ్యతరహా వ్యాపారుల్ని సైతం అవి దెబ్బతీస్తాయి. కేవలం నలుగురు వ్యక్తులే దేశాన్ని పరిపాలిస్తున్నారు. వారెవరో మీకు కూడా తెలుసు’ అంటూ రాహుల్‌ విమర్శించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా మృతి చెందిన రైతులకు.. రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎంపీలు మౌనం పాటించి నివాళి అర్పించారు. నిరసనల సమయంలో మరణించిన రైతులకు ప్రభుత్వం నివాళి అర్పించలేదు.. కాబట్టే తాను ఇప్పుడు ఇలా చేయాల్సి వచ్చిందని రాహుల్‌ వెల్లడించారు. 

ఇదీ చదవండి

చిన్నారికి కష్టం.. చలించిన మోదీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని