Rahul Gandhi: ‘అలా అయితే మీరు నడవొచ్చు కదా’.. అమిత్‌ షాకు రాహుల్‌ సవాల్!

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగా ఉంటే భాజపా నాయకులు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జమ్మూ నుంచి లాల్‌చౌక్‌ ఎందుకు నడవవరని రాహుల్‌ గాంధీ విమర్శించారు. 

Published : 30 Jan 2023 00:21 IST

శ్రీనగర్‌: భారత్‌ జోడో యాత్రలో భాగంగా జమ్మూకశ్మీర్‌లో ఉన్న రాహుల్‌ గాంధీ అక్కడి భద్రతా చర్యలపై మరోసారి కేంద్రాన్ని విమర్శించారు. కశ్మీర్‌లో అంతా బావుంటే భాజపా నాయకులు  జమ్మూ నుంచి లాల్‌చౌక్‌ వరకు ఎందుకు నడవడటంలేదని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌లో సాధారణ పౌరులు, భద్రతా బలగాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ సాధారణ పౌరుల భద్రతపై కేంద్రాన్ని ప్రశ్నించారు. మరోవైపు రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్రను ఈ రోజు శ్రీనగర్‌లో ముగించారు. 

జోడో యాత్ర ముగింపు సభను రేపు(సోమవారం) కాంగ్రెస్‌ పార్టీ శ్రీనగర్‌లో నిర్వహించనుంది. ఈ సందర్భంగా రాహుల్‌ విలేఖరులతో మాట్లాడుతూ..‘‘ జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగా ఉంటే భాజపా నాయకులు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జమ్మూ నుంచి లాల్‌చౌక్‌ ఎందుకు నడవవరు? భారత్ జోడో యాత్ర భారత రాజకీయాలపై ప్రభావం చూపుతుంది. అది ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడే చెప్పలేను.  ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చు. కానీ, అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఐక్యంగా ఆర్‌ఎస్‌ఎస్, భాజపాకి వ్యతిరేకంగా పోరాడాలి’’ అని చెప్పారు. 

శుక్రవారం రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు జమ్మూకశ్మీర్‌ పోలీసులు భద్రతను ఉపసంహరించుకోవడంతో యాత్రను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. అయితే, భద్రతపరంగా ఎలాంటి లోపం లేదని జమ్మూ పోలీసులు ప్రకటించారు. దీంతో శనివారం భారీ భద్రత మధ్య ప్రారంభమై ఆదివారం శ్రీనగర్‌లో ముగిసింది. మరోవైపు పోలీసులు, కేంద్రంపై రాహుల్‌ నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని భాజపా విమర్శించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని