KTR: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్‌ విఫలం: కేటీఆర్‌

రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే రాహుల్‌ గాంధీ దాని స్ఫూర్తిని కాపాడడంలో విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Published : 05 Jul 2024 04:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే రాహుల్‌ గాంధీ దాని స్ఫూర్తిని కాపాడడంలో విఫలమయ్యారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు కట్టుబడి ఉన్నామని చెబుతూ.. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులను అరికడతామని చెబుతున్న రాహుల్‌ మాటల్ని దేశం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. తమ మ్యానిఫెస్టోపై రాహుల్‌కు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన భారాస ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత భారాస ఎంపీ కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని కేటీఆర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని