‘హాథ్రస్‌ ఘటనలో ప్రభుత్వ వైఖరి దారుణం’

హాథ్రస్‌ హత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ యూపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ ఘటనలో యూపీ ప్రభుత్వం ఎంతో అనైతికంగా వ్యవహరించిందని ఆరోపించారు. అధికారులు సైతం దోషులను జైళ్లో వేయడం మాని..

Updated : 13 Oct 2020 04:41 IST

దిల్లీ: హాథ్రస్‌ హత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ యూపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ ఘటనలో యూపీ ప్రభుత్వం ఎంతో అనైతికంగా వ్యవహరించిందని ఆరోపించారు. అధికారులు సైతం దోషులను జైళ్లో వేయడం మాని.. బాధితులనే అవమానానికి గురిచేశారని విమర్శించారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ సామాజిక మధ్యమాల వేదికగా ప్రారంభించిన ‘స్పీక్‌ అప్‌ ఫర్‌ విమెన్‌ సేఫ్టీ’కార్యక్రమంలో మాట్లాడారు. ‘హాథ్రస్‌ ఘటన వ్యవహారంలో ప్రభుత్వ తీరు అనైతికంగా, అమానవీయంగా ఉంది. బాధితులకు సహాయం చేయకుండా ప్రభుత్వం దోషుల్ని రక్షించడానికి ప్రయత్నించింది. ఇప్పుడు నేను కేవలం ఒక్క మహిళ గురించి నేను మాట్లాడటం లేదు. దేశవ్యాప్తంగా లక్షలాది మహిళలకి ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. ఈ విషయంలో మనమంతా కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమాజంలో మార్పునకు సహకరించాలి. ఎందుకంటే దేశంలోని తల్లులు, కుమార్తెలకు జరుగుతున్నది సాధారణ అన్యాయం కాదు. హాథ్రస్‌ ఘటనలో మహిళకు జరిగిన అన్యాయంపై గళం విప్పాలి. నేరస్థుల్ని జైలుకు పంపడం ప్రభుత్వ విధి.. ఆ విధిని నిర్వర్తించి బాధితులకు న్యాయం చేయాలి. కానీ ప్రభుత్వం అలా చేయకుండా బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన నన్ను ఎందుకు అడ్డుకుందో అర్థం కావడం లేదు’అని యూపీ ప్రభుత్వంపై రాహుల్‌ విమర్శలు గుప్పించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని