Rahul gandhi: ప్రతిపక్షాల గొంతును మీడియా అణచివేస్తోంది: రాహుల్‌

ప్రతిపక్షాల గొంతును మీడియా అణచివేస్తోందని కాంగ్రెస్‌ ముఖ్యనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఆరోపించారు.అనేక మీడియా సంస్థల సహచరులు ఓ వ్యక్తిని మాత్రమే....

Updated : 20 Dec 2021 01:27 IST

దిల్లీ: ప్రతిపక్షాల గొంతును మీడియా అణచివేస్తోందని కాంగ్రెస్‌ ముఖ్యనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అనేక మీడియా సంస్థల సహచరులు ఓ వ్యక్తిని మాత్రమే భుజాలకెత్తుకున్నాయని ప్రధాని మోదీనుద్దేశించి పరోక్షంగా ప్రస్తావించారు. ప్రతిపక్షాల గొంతుకను ప్రజల చెంతకు చేర్చడంలో మీడియా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం మీరు భుజాలకెత్తుకున్న ఆ వ్యక్తి ఎప్పుడైనా మీ కోసం గొంతెత్తారా? అంటూ రాహుల్‌ హిందీలో ట్వీట్‌ చేశారు. మీ మనస్సాక్షికి లోబడి ఏది ఒప్పు అనిపిస్తే అది చేయండని, మీకు అన్యాయం జరిగినా మీపై హింసకు పాల్పడినా గతంలో మీతో ఉన్నానని, భవిష్యత్తులోనూ మీతో ఉంటానని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని