Published : 02 Jul 2022 23:50 IST

నరేగా.. మోదీకి ఇష్టం లేని పథకం: రాహుల్‌ గాంధీ

 పార్లమెంట్‌లోనూ దీనిపై విమర్శలు చేశారు

వయనాడ్‌ (కేరళ): కొవిడ్‌ సమయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా) ఎంతో మందికి ఉపాధి కల్పించి, ఎందరినో రక్షించిందని, అయితే ఈ పథకమంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. శనివారం ఆయన కేరళలోని తన పార్లమెంట్‌ నియోజకవర్గమైన వయనాడ్‌లోని ఓ పంచాయతీలో నరేగా వలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నరేగా పథకంపై ప్రస్తుత ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని విమర్శించారు. పార్లమెంట్‌లోనూ మోదీ నరేగాకు వ్యతిరేకంగా మాట్లాడారని తెలిపారు. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాల్లో ఈ పథకం కూడా ఒకటిగా పేర్కొన్నారని, ఇది దురదృష్టకరమని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం ఈ పథకం ప్రాముఖ్యత గుర్తించి.. దీన్ని 200 రోజులుకు పొడిగించి, రోజువారీ వేతనాన్ని కూడా రూ.400కు పెంచాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని