
సతీశ్ శర్మ భౌతిక కాయాన్ని మోసిన రాహుల్ ..
దిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కెప్టెన్ సతీశ్ శర్మ బుధవారం గోవాలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 73 ఏళ్ల శర్మ మృతదేహానికి నేడు దిల్లీలో అంత్యక్రియలు నిర్వహించారు. గాంధీల కుటుంబానికి అత్యంత విశ్వసనీయుడైన సతీశ్ శర్మ భౌతిక కాయాన్ని కాంగ్రెస్ కీలకనేత రాహుల్ గాంధీ స్వయంగా మోశారు.
1947లో సికింద్రాబాద్ జన్మించిన సతీశ్ శర్మ తొలుత కమర్షియల్ పైలెట్‌గా విధులు నిర్వహించారు. అనంతరం అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగి.. ఒక సారి రాజ్యసభ సభ్యుడిగా, మూడుసార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానంతరం.. రాహుల్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో ఆయనకు చేదోడువాదోడుగా నిలిచారు. నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వంలో 1993 నుంచి 1996 వరకు పెట్రోలియం, సహజవాయుశాఖా మంత్రిగా వ్యవహరించారు.
కెప్టెన్ సతీశ్ శర్మ మరణానికి తాను చాలా చింతిస్తున్నానని.. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు రాహుల్ గాంధీ సానుభూతి తెలిపారు. ఆయన లేని లోటు తీర్చలేదని ఆయన సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.