Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్‌ గాంధీ

ఇందూరు గిరిరాజ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన భాజపా జనగర్జన సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహల్‌ గాంధీ స్పందించారు.

Updated : 04 Oct 2023 00:08 IST

హైదరాబాద్‌: ఇందూరు గిరిరాజ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన భాజపా జనగర్జన సభలో ప్రధాని మోదీ(PM Modi) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహల్‌ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. నిజామాబాద్‌(Nizamabad) సభతో తాను గతంలో చెప్పింది ప్రధాని మోదీ అంగీకరించినట్లు అయిందన్నారు. భారాస-భాజపా భాగస్వామ్యం తెలంగాణను నాశనం చేసిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలను కాదని కాంగ్రెస్‌ ఇచ్చిన 6 హామీలతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. 

‘‘నేను చెప్పింది నిజామాబాద్‌ సభలో మోదీ అంగీకరించారు. భారాస అంటే భాజపా రిష్తేదార్‌ సమితి. భారాస - భాజపా భాగస్వామ్యం పదేళ్లలో తెలంగాణను నాశనం చేసింది. తెలంగాణ ప్రజలు భారాస - భాజపాను గమనిస్తున్నారు. ప్రజలు తెలివైనవారు. తెలంగాణలో రెండు పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారు. వచ్చే ఎన్నికల తర్వాత 6 హామీలతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది’’ అని రాహల్‌ గాంధీ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు