సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ను శిక్షించాలి: ఏక్‌నాథ్‌ శిందే

సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ను శిక్షించాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే అన్నారు. సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ను ఇక్కడి మహారాష్ట్ర వీధుల్లో తిరగనివ్వరని వ్యాఖ్యానించారు.

Published : 25 Mar 2023 23:48 IST

ముంబయి: దేశ భక్తుడైన సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) కఠినంగా శిక్షించాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) డిమాండ్‌ చేశారు. ప్రధానిని, సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ శిక్షార్హుడన్నారు. తనపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నా పేరు సావర్కర్‌ కాదు.. గాంధీ..! క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది’ అని ఆయన చేసిన వ్యాఖ్యానించారు. దీనిపై ఏక్‌నాథ్‌ శిందే అసెంబ్లీ వేదికగా స్పందించారు.

దేశ భక్తుడు, హిందుత్వ సిద్ధాంతకర్త అయిన వీడీ సావర్కర్‌ను,  మోదీని ఉద్దేశించి ఓబీసీ వర్గాన్ని రాహుల్‌ అవమానించారని శిందే అన్నారు. సావర్కర్‌ను అవమానించిన వ్యక్తులను ఇక్కడి ప్రజలు మహారాష్ట్ర వీధుల్లో కూడా తిరగనివ్వరని వ్యాఖ్యానించారు. ఏదైనా నేరంలో శిక్ష పడితే ఎంపీగా అనర్హులు అని ప్రకటించే చట్టాన్ని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రూపొందించిందని శిందే గుర్తు చేశారు. కొన్ని రోజుల క్రితం సభావరణలో రాహుల్ గాంధీ పోస్టర్‌ను అధికార పార్టీ సభ్యులు చెప్పులతో కొట్టడంతో వారిని సస్పెండ్ చేయాలంటూ మహా వికాస్‌ అఘాడి కూటమి డిమాండ్ చేయడంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గురించి వినటం ఇష్టం లేక సభ నుంచి వాకౌట్‌ చేశారని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని