
‘GDP’ బ్రహ్మాండం: ప్రభుత్వంపై రాహుల్ వ్యంగ్యాస్త్రం!
దిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతోన్న ఇంధన ధరలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ హయాంలో GDP( గ్యాస్, డీజిల్, పెట్రోల్) ధరలు బ్రహ్మాండంగా పెరిగాయంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఓవైపు సామాన్య ప్రజలు బాధపడుతుంటే.. మోదీ ప్రభుత్వం మాత్రం పన్నుల వసూళ్లలో బిజీగా ఉందని రాహుల్ గాంధీ ట్విటర్‌లో విమర్శించారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గడిచిన వారంలోనే నాలుగు సార్లు పెరగడంతో వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.85.70గా ఉండగా, ముంబయిలో రూ.92.28గా ఉంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే, వీటికి అంతర్జాతీయ మార్కెట్ కారణమని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కరోనా వైరస్ విజృంభణ ప్రభావం పెట్రోలియం ఉత్పత్తిపై పడటంతో ఆయా దేశాల నుంచి సరఫరా లోటు నెలకొందని, దీంతో ధరల్లో పెరుగుదల తలెత్తుత్తినట్లు కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి..
పెట్రోల్‌పై సుంకం తగ్గిస్తారా?
తుది దశకు బడ్జెట్ కసరత్తు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.