Rahul Gandhi: వయనాడ్‌ ఎంపీగా రాహుల్‌ గాంధీ రాజీనామా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వయనాడ్‌ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు. 

Updated : 18 Jun 2024 23:13 IST

దిల్లీ: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన రాహుల్‌ గాంధీ.. రాయ్‌బరేలీ నుంచే కొనసాగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కేరళలోని వయనాడ్‌ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. రాహుల్‌ గాంధీ రాజీనామాను ఆమోదించినట్లు లోక్ సభ సెక్రటేరియట్‌ ప్రకటించింది. ఈ మేరకు బులిటెన్‌ విడుదల చేసింది. రాహుల్‌ వయనాడ్‌, రాయ్‌బరేలీ.. ఈ రెండు స్థానాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారని, వయనాడ్‌ ఎంపీగా ఆయన చేసిన రాజీనామాకు ఆమోదం లభించినట్లు పేర్కొంది.

మరోవైపు, రాహుల్‌ రాజీనామాతో వయనాడ్‌ సీటుకు జరగనున్న ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం ప్రకటించారు. దీంతో ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. వయనాడ్‌ నుంచి ప్రియాంక ఎన్నికైతే తొలిసారిగా ఆమె పార్లమెంటులోకి అడుగుపెడతారు. ఈ ఎన్నికలో గెలిస్తే ముగ్గురు గాంధీలు (సోనియా, రాహుల్‌, ప్రియాంక) ఒకే సమయంలో పార్లమెంటులో ఉన్నట్లవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని