Goa polls: రాహుల్‌ గాంధీకి మోదీ ఫోబియా.. అమిత్‌ షా విమర్శలు

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. మోదీ ఫోబియాతో బాధపడుతున్నారని అమిత్‌ షా ఎద్దేవా చేశారు. రాహుల్​కు ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయమని పేర్కొన్నారు.......

Published : 31 Jan 2022 01:06 IST

పనాజీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సభలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం గోవాలో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. పోండా ప్రాంతంలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. భాజపా తెచ్చే ‘బంగారు గోవా’ కావాలో లేక, ‘గాంధీ కుటుంబానికి చెందిన గోవా’గా రాష్ట్రం మారాలో ప్రజలే నిర్ణయించుకోవాలని షా పేర్కొన్నారు. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. మోదీ ఫోబియాతో బాధపడుతున్నారని అమిత్‌ షా ఎద్దేవా చేశారు. రాహుల్​కు ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయమన్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా గోవా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని.. కానీ, అవి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని ఆప్, టీఎంసీ, ఎన్‌సీపీని ఉద్దేశించి అమిత్‌ షా విమర్శించారు. తమ పరిధిని విస్తరించుకోవడానికి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు మాత్రమే ఆ పార్టీలు గోవా ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు ఎద్దేవా చేశారు. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం భాజపాకే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాల అభివృద్ధికే మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకొచ్చారు. స్థిరత్వం ఉంటేనే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని వ్యాఖ్యానించారు.

గోవా పర్యటనలో భాగంగా షా మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. పోండా, సన్వోర్దెమ్​, వాస్కో నియోజకవర్గాల్లో భాజపా  ఈ సమావేశలను నిర్వహించింది. సన్వోర్దెమ్​లో షా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గోవాలోని మొత్తం 40 నియోజకవర్గాల్లో భాజపా తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఎన్నికలు ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని