Gujarat polls: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 21న ఆయన రాజ్‌కోట్‌తో పాటు సూరత్‌ జిల్లాలోని మహువాలో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు.

Published : 20 Nov 2022 01:34 IST

రాజ్‌కోట్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 21న ఆయన రాజ్‌కోట్‌తో పాటు సూరత్‌ జిల్లాలోని మహువాలో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారని పార్టీ నేత ఒకరు వెల్లడించారు. ఈ ప్రకటనతో గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అన్న సందిగ్ధతకు తెరపడింది. రెండున్నర నెలల తర్వాత రాహుల్‌ మళ్లీ గుజరాత్‌లో అడుగు పెట్టబోతున్నారు. భారత్‌ జోడో యాత్రకు రెండ్రోజుల ముందు సెప్టెంబర్‌ 5న చివరిసారిగా ఆయన గుజరాత్‌లో పర్యటించారు.

ప్రస్తుతం రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో నిమగ్నమై ఉన్నారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న యాత్ర 20న మధ్యప్రదేశ్‌లో అడుగుపెడుతోంది. ఇటీవల ఎన్నికలు జరిగిన హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆయన పర్యటించలేదు. దీంతో గుజరాత్‌ ఎన్నికల ప్రచారానికీ దూరంగా ఉంటారని ప్రచారం జరిగింది. ఇటీవల ఆ పార్టీ ప్రకటించిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో రాహుల్‌ పేరు ఉన్నప్పటికీ.. ఆయన పర్యటనపై మాత్రం స్పష్టత రాలేదు. ఓటమి భయంతోనే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారంటూ భాజపా టార్గెట్‌ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ పర్యటన ఖరారు కావడం గమనార్హం. రాజస్థాన్‌ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి రఘు శర్మ పర్యటన వివరాలను వెల్లడించారు. గుజరాత్‌ అసెంబ్లీకి డిసెంబర్‌ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. 8న ఫలితాలు వెలువడనున్నాయి. భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌ పోటీతో త్రిముఖ పోరు నెలకొంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని