Rahul Gandhi: ‘చింతన్‌ శివిర్‌’.. ఉదయ్‌పూర్‌కు రైలులోనే రాహుల్‌!

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ నెల 13 నుంచి 15 వరకు జరగబోయే కాంగ్రెస్‌ మేథోమధన సదస్సు ‘చింతన్‌ శివిర్‌’కు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు పలువురు కీలక నేతలు దిల్లీ నుంచి రైలులోనే...

Published : 10 May 2022 02:27 IST

దిల్లీ: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ నెల 13 నుంచి 15 వరకు జరగబోయే కాంగ్రెస్‌ మేథోమధన సదస్సు ‘చింతన్‌ శివిర్‌’కు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు పలువురు కీలక నేతలు దిల్లీ నుంచి రైలులోనే బయల్దేరి వెళ్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం రైలులో రెండు బోగీలు బుక్‌ చేసుకున్నట్టు సమాచారం. సోమవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రైలులో ఉదయ్‌పూర్‌కు వెళ్లాలన్న తన ప్రణాళికను రాహుల్‌ ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే చింతన్‌ శివిర్‌కు మిగతా నేతలు ఎలా వెళ్లాలనే నిర్ణయాన్ని వారి ఇష్టానికి వదిలిపెట్టారు. అయితే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైరాం రమేశ్, వివేక్‌ బన్సాల్‌తో పాటు మొత్తంగా 50 మందికి పైగా నేతలు రైలులోనే ఉదయ్‌పూర్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ సదస్సులో 422 మంది నేతలు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రైలులోనే కాన్పూర్‌ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు కూడా అదే తరహాలో వెళ్లాలని నిర్ణయ తీసుకోవడం గమనార్హం. తద్వారా తాము సామాన్యులమనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని